ముంబై, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): జూదానికి బానిసగా మారి, భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఒక వ్యక్తి హై ప్రొఫైల్ సీరియల్ దొంగగా మారి పోలీసులు ముప్పుతిప్పలు పెట్టి ఎట్టకేలకు చిక్కాడు. ముంబై, సయిన్ హై ప్రొఫైల్ ప్రాంతంలో నివసించే మోహన్ కోకటే (49) పలు చోరీలకు పాల్పడ్డాడు.
అయితే అతడి బూట్ల ఆధారంగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని సోదరి దుబాయ్లో, సోదరుడు అమెరికాలో నివసిస్తున్నారు. అతని కుమారుల్లో ఒకరు చార్టర్డ్ అకౌంటెంట్ కాగా, మరొకరు ఇంజినీర్.