హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో బెయిల్ కోసం బండి సాయి భగీరథ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. మే 8న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే సీఆర్పీసీ సెక్షన్ 161 కింద బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేసి, తదనుగుణంగా అదనపు సెక్షన్లు చేర్చినట్టు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం ప్ర త్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని, దాదాపు 18మంది సాక్షుల వాంగ్మూలాలు న మోదు చేసిందని వివరించారు. త్వరలోనే అభియోగపత్రం దాఖలు చేసే దశలో బెయిల్ మంజూరు చేయరాదని కోరారు.
ఆయనకు బెయిల్ మంజూ రు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని తెలిపారు. బాధితురాలి తరఫున సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు వాదనలు వినిపి స్తూ.. దర్యాప్తు ఇం కా పూర్తిస్థాయిలో ముగియలేదని, ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. బాధితురాలికి, నిందితుడికి పలువురు ఉమ్మడి స్నేహితులు ఉన్నప్పటికీ వారిలో కేవలం ఇద్దరినే విచారించారని తెలిపారు.
నిందితుడి తండ్రి హోదా, పలుకుబడి దృష్ట్యా మిగిలిన సాక్షులు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నదని, వారు మాట మార్చితే కేసు బలహీనపడే ప్రమాదం ఉన్నదని స్పష్టం చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టీ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేస్తే కోర్టు విధించే అన్ని షరతులను పాటిస్తామస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 9న తీర్పును వెలువరిస్తామని జస్టిస్ సుజన తెలిపారు. కాగా, సీనియర్ న్యాయవాది నాగేశ్వర్రావు అభ్యంతరం పరిగ ణనలోకి పోక్సో, అత్యాచారం లాంటి కేసుల్లో ఆన్లైన్ ప్రసారాన్ని నిలిపివేయాలని న్యాయ మూర్తి ఆదేశించారు.