దేశ చరిత్ర ఆధారంగా తీసిన సినిమా
కొత్తవాళ్లమంతా కలిసి భారీ ఖర్చుతో ఈ కొత్త ప్రయత్నం చేశాం. అనంతపద్మనాభస్వామి తెరపై కనిపిస్తుంటే ప్రేక్షకులు చెప్పులు విడిచి చూస్తున్నారు. వారి కళ్లలో ఆనందభాష్పాలు కనిపిస్తున్నాయి.
‘కొత్తవాళ్లమంతా కలిసి భారీ ఖర్చుతో ఈ కొత్త ప్రయత్నం చేశాం. అనంతపద్మనాభస్వామి తెరపై కనిపిస్తుంటే ప్రేక్షకులు చెప్పులు విడిచి చూస్తున్నారు. వారి కళ్లలో ఆనందభాష్పాలు కనిపిస్తున్నాయి. ఇంతకు మించిన భావోద్వేగం ఏముంటుంది? ‘హరహర మహాదేవ’ నినాదంతో థియేటర్లు మారుమోగుతుంటే ఇంతమించిన అనుభూతి ఏముంటుంది? దర్శకుడు అభిషేక్ గొప్ప విజన్‌తో ఈ సినిమా తీశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్, ైక్లెమాక్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి’ అని హీరో విరాట్‌కర్ణ అన్నారు. ఆయన హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘నాగబంధం’. నభానటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలు. కిశోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన థాంక్స్‌మీట్‌లో హీరో విరాట్‌కర్ణ మాట్లాడారు. ‘సినిమాకు అద్భుతమైన స్పందన వస్తున్నది. ఫస్టాఫ్‌లో కాస్త లెన్త్ ఎక్కువైంది. దాంతో ప్రేక్షకుల సలహా మేరకు కాస్త తగ్గించాం. ైక్లెమాక్స్ కూడా ట్రిమ్ చేశాం. ఇది ఫిక్షనల్ స్టోరీ కాదు. ఆఫ్ఘన్లు మన దేశంపై దాడికి తెగబడ్డప్పుడు. ఆదిశంకరాచార్యులవారు నాగసాధువులనే వర్గాన్ని ఏర్పాటుచేసి, మన దేవాలయాలను రక్షించారు. మన చరిత్ర ఆధారంగానే తీసిన సినిమా ఇది. నేటి తరానికీ, రానున్న తరానికి కూడా మన చరిత్ర తెలియానే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఇది’ అని దర్శకుడు అభిషేక్ నామా పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

