భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై 9న తీర్పు.. హైకోర్టులో ముగిసిన వాదనలు
పోక్సో కేసులో బెయిల్ కోసం బండి సాయి భగీరథ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. మే 8న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే సీఆర్పీసీ సెక్షన్ 161 కింద బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేసి, తదనుగుణంగా అదనపు సెక్షన్లు చేర్చినట్టు తెలిపారు.
హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో బెయిల్ కోసం బండి సాయి భగీరథ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. మే 8న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే సీఆర్పీసీ సెక్షన్ 161 కింద బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేసి, తదనుగుణంగా అదనపు సెక్షన్లు చేర్చినట్టు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం ప్ర త్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని, దాదాపు 18మంది సాక్షుల వాంగ్మూలాలు న మోదు చేసిందని వివరించారు. త్వరలోనే అభియోగపత్రం దాఖలు చేసే దశలో బెయిల్ మంజూరు చేయరాదని కోరారు.
ఆయనకు బెయిల్ మంజూ రు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని తెలిపారు. బాధితురాలి తరఫున సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు వాదనలు వినిపి స్తూ.. దర్యాప్తు ఇం కా పూర్తిస్థాయిలో ముగియలేదని, ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. బాధితురాలికి, నిందితుడికి పలువురు ఉమ్మడి స్నేహితులు ఉన్నప్పటికీ వారిలో కేవలం ఇద్దరినే విచారించారని తెలిపారు.
నిందితుడి తండ్రి హోదా, పలుకుబడి దృష్ట్యా మిగిలిన సాక్షులు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నదని, వారు మాట మార్చితే కేసు బలహీనపడే ప్రమాదం ఉన్నదని స్పష్టం చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టీ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేస్తే కోర్టు విధించే అన్ని షరతులను పాటిస్తామస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 9న తీర్పును వెలువరిస్తామని జస్టిస్ సుజన తెలిపారు. కాగా, సీనియర్ న్యాయవాది నాగేశ్వర్రావు అభ్యంతరం పరిగ ణనలోకి పోక్సో, అత్యాచారం లాంటి కేసుల్లో ఆన్లైన్ ప్రసారాన్ని నిలిపివేయాలని న్యాయ మూర్తి ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

