MLA Dr. Sanjay Kalvakuntla | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నేతన్నలకు పునర్ వైభవం.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే నేతన్నలకు పునర్ వైభవం వచ్చిందని, నేత కార్మికులకు చేతినిండా పని కల్పించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు.
- మగ్గాలతో అధ్బుతాలు సృష్టించే సత్తా నేతన్నల సొంతం
- చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
MLA Dr. Sanjay Kalvakuntla | కోరుట్ల, ఆగస్ట్ 7: బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే నేతన్నలకు పునర్ వైభవం వచ్చిందని, నేత కార్మికులకు చేతినిండా పని కల్పించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనం ఆవరణలో గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఎమ్మెల్యే రాట్నంపై నూలు వడికారు.
నేత కార్మికులతో కలిసి పతాకావిష్కరణ చేసిన ఆయన కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మగ్గాలతో అద్భుతాలు సృష్టించే సత్తా మన నేతన్నల సొంతమని పేర్కొన్నారు. ఆగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరలు తయారు చేసే నైపుణ్యం మన తెలంగాణ నేత కార్మికుల ప్రత్యేకత ఆని పేర్కొన్నారు. తరతరాలుగా చేనేత వృత్తిని నమ్ముకున్న నేత కార్మికులకు సమైక్య పాలనలో పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నేతన్నలకు చేతి నిండా పనితో ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు.
ఉన్న ఊరిలో ఉపాధి కరువై పొట్ట చేతపట్టుకొని సూరత్, భీవండిలకు వలస వెళ్లిన చేనేత కార్మికుల కోసం వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టి తిరిగి తెలంగాణకు రప్పించి, ఉపాధి కల్పించామన్నారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా, బతుకమ్మ చీరలు, రుణమాఫీ, పెన్షన్లు వంటి ఎన్నో పథకాల అమలుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. కోరుట్ల దేనేత సహకార సంఘం భవనాన్ని వాటాదారులకు దక్కెలా కృషి చేస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘ మాజీ అధ్యక్షులు గోనె శంకర్, పద్మశాలి సంఘ ఆధ్యక్షులు గుంటుక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, సహాయ కార్యదర్శి గోసికొండ కుమారస్వామి, కోశాధికారి అందె రాజ్ కుమార్, టీఆర్పీఎస్ కార్యదర్శి జిల్లా ధనుంజయ్, నాయకులు గద్దం మధు, చెన్న విశ్వనాథం. మచ్చ కవిత, ఎక్కలదేవి రాంచందర్, నల్ల ప్రశాంత్, పడాల గణేష్, ఎక్కలదేవి నవీన్, ముల్క ప్రసాద్, ఆడెపు నరేష్, చేనేత సహకార సంఘ వాటాదారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

