హైదరాబాద్: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్) 2025 సీజన్‌కు వేళైంది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 16 దాకా సాగే ఈ టోర్నీకి హైదరాబాద్ (జింఖానా గ్రౌండ్స్, ఉప్పల్ స్టేడియం), అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో ఆతిథ్యమివ్వనున్నాయి.
వచ్చే నెలలో అబుదాబి వేదికగా జరగాల్సి ఉన్న ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించడంతో పాటు భారత జట్టులో చోటు సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్న కుర్రాళ్లకు ఇది సదావకాశం.