హిమాయత్‌నగర్,నవంబర్ 23: రైతులు పండించిన ధాన్యంను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి ఇ.టి నరసింహ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చర్యలను నిరసిస్తూ నల్లదుస్తులను ధరించి మంగళవారం హిమాయత్‌నగర్ నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు సీపీఐ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటను కొనకుండా కేంద్రం డ్రామాలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒప్పందం ప్రకారం ప్రతి గింజా కొనుగోలు చేస్తామని చెబుతున్నారని, ఇంతకు ఆ ఒప్పదం ఏమిటో బహిర్గతం చేయాలన్నారు.అకాల వర్షాలతో పంట తడిచి రైతులు ఇబ్బందులు పడుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు శంకర్‌నాయక్, ఎస్.ఛాయాదేవి, అంజయ్యనాయక్, బి.వెంకటేశం, ప్రేంపావని, కమతం యాదగిరి,సలీంఖాన్, మల్లేశ్, సురేందర్,జ్యోతి పాల్గొన్నారు.