సిద్దిపేట : కాల్వకు గండిపడి సాగునీళ్లు వృథాగా పోతున్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. గండి గుండా నీళ్లు వృథాగా పరిసరాల్లోని పంటపొలాల్లో కలుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామశివారులోని బొక్కల చెరువు వద్ద ప్రధాన కాల్వకు గండిపడటంతో మల్లన్నసాగర్ నీళ్లు వృథాగా పోతున్నాయి.
రైతులపట్ల కాంగ్రెస్ పాలకులకు ఉన్న సోయి ఏపాటిదో ఇలాంటి ఘటనలు రుజువు చేస్తున్నాయి. గండిపడటంతో మల్లన్నసాగర్ నీళ్లు వృథాగా పోతున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు చూడవచ్చు..
కాల్వకు గండి.. వృథాగా పంట పొలాల్లోకి మల్లన్నసాగర్ నీరు
సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామశివారులోని బొక్కల చెరువు వద్ద ప్రధాన కాల్వకు గండి
గండి పడడంతో చుట్టుపక్కల ఉన్న పంట పొలాల్లోకి వెళ్లిన మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నీళ్లు pic.twitter.com/oHTIw3Epo4
— Telugu Scribe (@TeluguScribe) January 28, 2026