ఆదిలాబాద్, జనవరి 6(నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధరతో సోయా కొనగోలు చేయాలని, తేమతో సంబంధం లేకుండా పత్తిని సేకరించాలని, సంక్రాంతి లోగా యాసంగి పంటలకు రైతు భరోసా విడుదల చేయాలని, యూరియా యాప్‌ను ఎత్తివేయాలని..’ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆదిలాబాద్ పట్టణ బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌కు వ్యాపారులు, కార్మికులు, ఇతర వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఉదయం మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు బస్ డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు.
బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు డిపో ఎదుటకు చేరుకొని ఆందోళన విరమింప చేసే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ నాయకులు ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు మాజీ మంత్రి జోగు రామన్నను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌తోపాటు ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రామన్నను అరెస్ట్ చేసి మావల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. యువ నాయకులు జోగు మహేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్, అశోక్‌రోడ్, గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్, పంజాబ్ చౌక్ మీదుగా భారీగా మోటార్ సైకిళ్ల ర్యాలీ తీసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంద్ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణం నిర్మానుష్యంగా మారింది.

ఆదిలాబాద్ జిల్లాలో సోయాబిన్ కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరుస ఆందోళనలు చేస్తున్నా కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం సిగ్గు చేటని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కారం అ య్యేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. రైతుల సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు త మకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నా రు.
ఆదిలాబాద్ జిల్లాలో 29 మంది రై తులు పంటలు నష్టపోయి ఆర్థిక ఇ బ్బందులతో ఆత్మహత్యలు చేసుకు న్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప ట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్య క్తం చేశారు. రైతుల సమస్యలపై కనీ స అవగాహన లేని కాంగ్రెస్ ప్రభు త్వం రాష్ట్రంలో అధికారంలో ఉండ డం దురదృష్టకరమని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు యాసం నర్సింగరావు, మెట్టు ప్రహ్లాద్, యూనిస్ అక్బానీ, సాజిదొద్దీన్, గండ్రత్ రమేశ్, విజ్జిగిరి నారాయణ, బుట్టి శివకుమార్, వాగ్మారే ప్రశాంత్, లింగారెడ్డి, సెవ్వా జగదీశ్, కొండ గణేశ్, దమ్మపాల్, అడప తిరుపతి, బట్టు సతీశ్, తదితరులు పాల్గొన్నారు.