హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : పౌరులకు ఎన్నికల సేవలను మరింత సులభతరం చేసేందుకు టీ-పోల్ (Te-poll) అనే కొత్త మొబైల్ అప్లికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం(టీజీ ఎస్ఈసీ) గురువారం విడుదల చేసింది. ఈ యాప్ ప్రస్తుతం ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నది.
ఓటర్ స్లిప్ డౌన్లోడ్, పోలింగ్ స్టేషన్ సమాచారం, ఫిర్యాదు, ఫిర్యాదుల పరిషార ప్రగతిని(ట్రాకింగ్) తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని ఎస్ఈసీ కార్యదర్శి మందా మకరంద్ తెలిపారు. ప్లేస్టోర్ నుంచి ఈ లింకు ద్వారా https://play.google.com/ store/apps/details?id=com.cgg.gov.in.te_poll_telugu టీ-పోల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు.