‘జిగ్రీస్’ సినిమాలో తాను పోషించిన పాత్రతో యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారని చెప్పారు చిత్ర హీరో కృష్ణ బూరుగుల. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా కృష్ణ బూరుగుల మాట్లాడుతూ ‘షార్ట్‌ఫిల్మ్ చేసిన అనుభవంతో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నా. అనంతరం ఇండస్ట్రీలోకి వచ్చాను. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో చిన్న రోల్ చేశాను. కానీ అది ఎడిటింగ్‌లో పోయింది. అవకాశం మిస్సయినా ఆ సినిమాలో నటించడం నాకు ధైర్యాన్నిచ్చింది’ అన్నారు.
మానాన్న నక్సలైట్, కృష్ణమ్మ వంటి చిత్రాలతో పాటు ‘ఏటీఎం’ వెబ్‌సిరీస్ నటుడిగా తనకు గుర్తింపును తీసుకొచ్చాయని, ఇక ‘జిగ్రీస్’ సినిమా కెరీర్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చిందని ఆయన తెలిపారు. “జిగ్రీస్’ నా రియల్‌లైఫ్‌కు భిన్నమైన పాత్ర. పాత్రకు తగ్గట్లు నా లుక్ మార్చుకున్నా. ఈ సినిమా బాగుందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మెచ్చుకున్నారు. యూత్ నా క్యారెక్టర్‌తో కనెక్ట్ అయ్యారు. ఏ సినిమా చేసినా నా పాత్రలో కొత్తదనం ఉండాలని కోరుకుంటా’ అని కృష్ణ బూరుగుల పేర్కొన్నారు.