TG ICET | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 15: తెలంగాణ ఐసెట్- 2025 కన్వీనర్ విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా 2025-26 విద్యాసంవత్సరానికి కాకతీయ విశ్వవిద్యాలయం సుబేదారి యూనివర్సిటీ మహిళా కాలేజీలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కొన్ని సీట్లు ఉన్నాయని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 17 నుంచి 21 వరకు స్పాట్ అడ్మిషన్ కోసం ఈ కళాశాలలో హాజరుకావచ్చని ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఎస్.ఎల్. సోజన్య తెలిపారు. సీట్ల ఖాళీల వివరాలు కాలేజీ నోటీసు బోర్డు tgicet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, అడ్మిషన్లు టీజీఐసెట్-2025 సమన్వయకర్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఇవ్వబడతాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.