Kakatiya University | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 15: కాకతీయ విశ్వవిద్యాలయం లోని బోధనా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులకు త్వరలో ‘ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్’ అమలులోకి తీసుకువస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం వెల్లడించారు. బుధవారం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డితో కమిటీ హాల్లో జరిగిన ప్రిన్సిపాళ్ల సమావేశంలో దీని గురించి చర్చించిన్నట్లు ఆయన రామచంద్రం తెలిపారు.