PM Modi Tour | శ్రీశైలం పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ట్వీట్ (ఎక్స్) చేశారు. రేపు అనగా అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్లో ఉంటానని ట్విట్టర్(ఎక్స్)లో తెలిపారు. శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తానని పేర్కొన్నారు. అనంతరం కర్నూలులో రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. ఈ పనులు విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించినవని వివరించారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన షెడ్యూల్ విడుదలైంది. గురువారం ఉదయం 7.20 గంటలకు దిల్లీ నుంచి బయల్దేరతారు. 9.50 గంటలకు కర్నూలు ఎయిర్పోర్టుక చేరుకుంటారు. అక్కడి నుంచి ఎంఐ-17 హెలికాప్టర్లో బయల్దేరి 10.35 గంటలకు సుందిపెంటకు చేరుకుంటారు. సుందిపెంట నుంచి 10.55 గంటలకు శ్రీశైలం చేరుకుని, 11.15 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. 12.05 గంటలకు బయల్దేరి వెళ్లి శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శిస్తారు. అనంతరం 12.40 గంటలకు భ్రమరాంబ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. అక్కడే విశ్రాంతి తీసుకుని 13.40 గంటలకు సుందిపెంట నుంచి కర్నూలుకు హెలికాప్టర్లో వెళ్తారు.
రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలు లో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.ఈ పనులు విద్యుత్,…
— Narendra Modi (@narendramodi) October 15, 2025

Modi Srisailam Tour1

Modi Srisailam Tour2