BJP | హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫొటోల విషయంలో బీజేపీ, బీసీ సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరగడంతో ఇరువర్గాల నేతలు తన్నుకున్నారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ ఆర్.కృష్ణయ్య వారించేందుకు ఎంత ప్రయత్నించినా వినిపించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 18వ తేదీన బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరేందుకు బీసీ సంఘాల నేతలతో కలిసి ఆర్.కృష్ణయ్య ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావును కలిశారు. అనంతరం ఇద్దరూ కలిసి ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్న క్రమంలో బీజేపీ, బీసీ సంఘాల నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. జూనియర్ అయ్యి ఉండి ఫొటోలకు ఎలా ముందుకు వెళ్తావని గుజ్జా కృష్ణ, గుజ్జా సత్యం ఒకరినొకరు తిట్టుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఆర్.కృష్ణయ్య, రాంచందర్‌రావు ఎదురుగానే ఈ గొడవంతా జరిగింది. కొట్టుకోవడం ఆపేయాలని వారిద్దరూ ఎంత వారించినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో సహచర నాయకులు అతి కష్టం మీద అదుపు చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకొచ్చింది.
బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఫోటోల విషయంలో కొట్టుకున్న బీజేపీ, బీసీ సంఘాల నేతలు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘం నేతలు, బీజేపీ నేతల మధ్య చెలరేగిన ఘర్షణ
ఈనెల 18న రాష్ట్ర బంద్‌కు మద్దతివ్వాలని కోరేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును కలిసిన… pic.twitter.com/IJEdDdSZ8u
— Telugu Scribe (@TeluguScribe) October 15, 2025