TET | హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): టెట్ పరీక్షలు నేటి(గురువారం)నుంచి ఈనెల 20వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 92 పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్-2 పరీక్ష ఉంటుంది. 8, 9, 10, 18 తేదీల్లో పేపర్-1 పరీక్ష జరుగుతుంది. పరీక్షలకు 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా పేపర్-1కు 94,327 మంది, పేపర్-2కు 1,81,426 మంది అప్లయ్ చేశారు.