మెదక్ జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలు
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్
మెదక్ మున్సిపాలిటీ/ సంగారెడ్డి అర్బన్, జూన్ 7 : ఈ నెల 12న నిర్వహించే టెట్ పరీక్ష సజావుగా జరిగేలా ఏర్పా ట్లు చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులను ఆదేశించారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు జరిగే మొదటి పేపర్‌కు 8,650 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు జరిగే రెండో పేపర్‌కు 6,157 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు ఏర్పా టు చేసిన ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. టెట్ నిర్వహణకు జిల్లా నోడల్ అధికారిగా మెదక్ ఆర్డీవోను నియమించడంతో పాటు 250 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష సాఫీగా నిర్వహించడానికి 5 రూట్లను ఏర్పాటు చేసి ప్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. సమావేశంలో మెదక్ డీఎస్పీ సైదులు, మెదక్ ఆర్డీవో సాయిరాం, పరీక్షల నిర్వాహకులు రామేశ్వరప్రసాద్, డీఈవో రమేశ్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఏడీ శంకర్ పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్లో రూట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు అదనపు కలెక్టర్ వీరారెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో టెట్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు 8143558112 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో సంగారెడ్డి డీఈవో నాంపల్లి రాజేశ్, ఏడీ విజయ, రూట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.