శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లా, సురాన్కోట్లో ఉగ్రవాద స్థావరాన్ని భద్రతా దళాలు, పోలీసులు గుర్తించారు. పహల్గాం ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుపుతుండగా, ఉగ్రవాద స్థావరం బయటపడింది. టిఫిన్ బాక్సుల్లో మూడు, స్టీల్ బకెట్లలో రెండు ఐఈడీలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.