సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని బీసీ బాలికల ప్రభుత్వ కళాశాల వసతి గృహంలో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..విద్యార్థినులతో హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు రాజేష్ చౌహన్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఇష్టారీతిగా బూతులు తిడుతూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు.
బాలికల విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి పంపితే ఇలాంటి లైంగిక వేధింపులు తట్టుకోలే కపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో నివాసముంటున్న విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కలసి ఆందోళనకు దిగారు. వెంటనే వార్డెన్ శారదను సస్పెండ్ చేయడంతో పాటు, ఆమె కుమారుడు రాజేష్ చౌహన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.