జోగులాంబ గద్వాల : ధరూర్ మండలం జాంపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమ రాయుడు ( Beema Raidu ) మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సర్పంచ్‌ను( Former Sarpanch ) హత్య చేశారని ఆరోపిస్తూ శనివారం కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులు, బందువులు మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

శనివారం సాయంత్రం మృతదేహం నందిన్నె గ్రామానికి చేరుకోగా మృతుని కుటుంబసభ్యులు, గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన( Protest ) చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా కోపాద్రిక్తులైన గ్రామస్థులు హత్యకు కారకులను భావిస్తున్న వ్యక్తికి చెందిన రైస్‌మిల్లుపై దాడికి యత్నించారు.
ముందస్తుగానే సమాచారం అందుకున్న గద్వాల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రైస్ మిల్లుపై దాడిని అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు.