Tension | మాజీ సర్పంచ్ అంత్యక్రియలో ఉద్రిక్తత ..రైస్‌మిల్లుపై దాడికి యత్నం
Tension | ధరూర్ మండలం జాంపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమ రాయుడు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జోగులాంబ గద్వాల : ధరూర్ మండలం జాంపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమ రాయుడు ( Beema Raidu ) మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సర్పంచ్‌ను( Former Sarpanch ) హత్య చేశారని ఆరోపిస్తూ శనివారం కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులు, బందువులు మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

శనివారం సాయంత్రం మృతదేహం నందిన్నె గ్రామానికి చేరుకోగా మృతుని కుటుంబసభ్యులు, గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన( Protest ) చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా కోపాద్రిక్తులైన గ్రామస్థులు హత్యకు కారకులను భావిస్తున్న వ్యక్తికి చెందిన రైస్‌మిల్లుపై దాడికి యత్నించారు.
ముందస్తుగానే సమాచారం అందుకున్న గద్వాల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రైస్ మిల్లుపై దాడిని అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

