Transfers | తెలంగాణలో తొమ్మిది మంది నాన్ క్యాడర్ ఎస్పీలను ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీలుగా పీ కరుణాకర్, ఎస్వీఎన్ శివరామ్, ఆర్ జగదీశ్వర్‌రెడ్డిని బదిలీ చేసింది. సైబరాబాద్ ఎస్బీ డీజీపీగా వైవీఎస్ సుధీంద్ర, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా సాయిశ్రీ నియామకమయ్యారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా వి అరవింద్ బాబు, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా ధార కవిత, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా ఎం రవీందర్‌రెడ్డి, సీఐడీ ఎస్పీగా ఎన్ అశోక్ కుమార్ బదిలీ నియామకమయ్యారు. ఇదిలా ఉండగా శుక్రవారం ప్రభుత్వం 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టింది. 32 మంది అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.