Raashii Khanna | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని ముద్దుగుమ్మ రాశీఖన్నా (Raashii Khanna). తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఓ వైపు స్టార్ యాక్టర్లు, మరోవైపు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ వన్ ఆఫ్ ది మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్‌లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవలే తెలుసు కదా సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ తన యాక్టింగ్‌తో అదరగొట్టేసింది.
తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. కొన్ని సినిమాలు ప్రేక్షకులు తనను చూసే, గుర్తించే విధానం మార్చేశాయని చెప్పింది. మద్రాస్ కేఫ్ జనాలు నన్ను ఓ యాక్టర్‌గా గుర్తించేలా చేసింది. కానీ ఈ మూవీ తర్వాత నేను అన్నీ కమర్షియల్ సినిమాలు చేశా. అయితే తొలిప్రేమ సినిమా నాకు పాజిటివ్ టర్న్(అనుకూలమైన మలుపు) అందించి.. జనాలు నాలోని టాలెంట్‌ను మరోసారి గుర్తించేలా చేసింది.
తొలిప్రేమ చాలా మార్చేసింది. ఈ సినిమాతో జనాలు కేవలం నన్ను కమర్షియల్ ముఖంగా మాత్రమే చూడకుండా ఓ నటిగా చూడటం మొదలుపెట్టారంటూ చెప్పుకొచ్చింది. తొలిప్రేమ తనలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేసిందని.. తెలుగులో క్యారెక్టర్ ఓరియెంటెడ్ రోల్స్‌లో నటించేలా ఉత్సాహాన్ని నింపిందని చెప్పింది. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
NC 24 | నాగచైతన్య బర్త్ డే స్పెషల్.. మహేశ్ బాబు వారణాసి లుక్‌తో ఎన్సీ 24 క్రేజీ న్యూస్