Ananya Panday | బాలీవుడ్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటారు కార్తీక్ ఆర్యన్, అనన్యపాండే. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తోన్న చిత్రం Tu Meri Main Tera Main Tera Tu Meri. సమీర్ సంజయ్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదలకు మరో నెల సమయమున్న నేపథ్యంలో కార్తీక్ ఆర్యన్ టీం ఇప్పటి నుంచే ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉంది.
ఇదిలా ఉంటే కార్తీక్ ఆర్యన్, అనన్యపాండే కాఫీ డేట్‌కు వెళ్లారు. కాఫీ డేట్లో ఇద్దరూ సరదాగా చిట్ చాట్ చేశారు. కెఫేలో ఉన్న ఈ క్రేజీ యాక్టర్లను అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్‌మనిపించాయి. కాఫీ డేట్ స్టిల్స్‌తోపాటు ప్రమోషనల్ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది అనన్యపాండే. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయింది.
2024లో భూల్ భులైయా 3 సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు కార్తీక్ ఆర్యన్. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
కాఫీ డేట్లో ఇలా..
Kartik Aryan and Ananya Panday on Coffee Date 😳#KartikAaryan #AnanyaPanday #BollywoodNews pic.twitter.com/RtF2zM3E3e
— Mansi (@imansiofficial) November 21, 2025
ప్రమోషన్స్‌లో..
Seeing Kartik Aaryan and Ananya Panday together today has made us all the more excited for Tu Meri Main Tera Main Tera Tu Meri this Christmas. #KartikAaryan #AnanyaPanday #TuMeriMainTeraMainTeraTuMeri #tmmtmttm #bollywood #entertainment #Christmas pic.twitter.com/o9CW2uWjAV
— HT City (@htcity) November 21, 2025
NC 24 | నాగచైతన్య బర్త్ డే స్పెషల్.. మహేశ్ బాబు వారణాసి లుక్‌తో ఎన్సీ 24 క్రేజీ న్యూస్
Abishan Jeevinth | హీరోగా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు.. ‘విత్ లవ్’ టీజర్ విడుదల!