Karthikeya Birthday | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు, యువ నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ నేడు తన 34వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలోని ప్రముఖులతో పాటు ‘వారణాసి’ (SSMB29) చిత్ర బృందం ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తాజాగా కార్తికేయకి సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మహేశ్‌బాబు ఎక్స్ వేదికగా కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. మేము నిర్మించే ప్రతిదాని వెనుక ఉండే నిశ్శబ్దపు శక్తివి నువ్వే. హ్యాపీ బర్త్‌డే కార్త్. అత్యంత కష్టమైన పనులను కూడా నువ్వు ఎంత సులువుగా, కూల్‌గా చక్కబెడతావో చూస్తుంటే నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతుంది. రాబోయే సంవత్సరంలో కూడా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా అంటూ మహేశ్ రాసుకోచ్చాడు.
The silent man behind everything we build…..Happy Birthday Karth.. Always amazed to see you hold the toughest pieces together with ease….🤗🤗🤗 Wishing you a great year onwards and upwards♥️♥️♥️ @ssk1122 pic.twitter.com/Y73JpZs4lZ
— Mahesh Babu (@urstrulyMahesh) November 22, 2025
అలాగే ప్రియాంక చోప్రా కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. తేలికగా తీసుకో నా మిత్రమా! ప్రతి పని వెనుక నిశ్శబ్దంగా నిలబడే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సినిమా (వారణాసి) ప్రయాణంలో నీతో కలిసి డాన్స్ చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ప్రియాంక చోప్రా రాసుకోచ్చింది. ఈ పోస్ట్‌కి ఒక వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో ‘ప్రేమికుడు’లోని సూపర్ హిట్ పాట ‘ఊర్వశి.. ఊర్వశి’ పాటకు కార్తికేయతో కలిసి సరదాగా స్టెప్పులేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కార్తికేయ ప్రస్తుతం ‘వారణాసి’కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
Take it easy my friend! To the man who silently holds up the fort. Happy birthday @ssk1122
So happy to be dancing through this movie with you. pic.twitter.com/F6AhZ6QVrv
— PRIYANKA (@priyankachopra) November 22, 2025