NC24 | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం NC24 (వర్కింగ్ టైటిల్) . ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీ నుంచి ఇటీవలే బీటీఎస్ వీడియోను షేర్ చేస్తూ.. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నవంబర్ 23న లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారని తెలిసిందే. ఈ మేరకు స్టన్నింగ్ లుక్‌తో క్రేజీ వార్తను షేర్ చేశారు మేకర్స్.
ఎన్సీ 24 ఫస్ట్ లుక్‌ను టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేశ్ బాబు లాంచ్ చేయనున్నాడు. నవంబర్ 23న (రేపు) నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఉదయం 10:08 గంటలకు ఎన్సీ 24 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేయనున్నాడని తెలియజేస్తూ స్పెషల్ లుక్ ఒకటి విడుదల చేశారు. వారణాసి పోస్టర్లో చైతూను మహేశ్‌బాబుతో కలిసి డిజైన్ చేసిన పోస్టర్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మూవీలో లాపతా లేడీస్ ఫేం స్పర్శ్ శ్రీవాత్సవ NC24 కీ రోల్ పోషిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎస్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ ఈ మూవీకి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ సమకూరుస్తుండటంతో హైప్ మరింత పెరిగిపోతుంది.
#SSMBforYUVASAMRAT ❤️🔥❤️🔥❤️🔥#Globetrotter, Superstar @urstrulyMahesh garu to launch the #NC24 Title and First Look Poster tomorrow at 10:08 AM 🦁🌏🔥
Stay tuned 💥 💥@chay_akkineni @karthikdandu86 @Meenakshiioffl @BvsnP @aryasukku #SparshShrivastava #RagulDHerian @AJANEESHB… pic.twitter.com/cxf0pcIjpE
— BA Raju’s Team (@baraju_SuperHit) November 22, 2025