Manoj Bajpayee | పాపులర్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి చాలా కాలం తర్వాత వస్తోన్న హార్రర్ కామెడీ చిత్రం (Police Station Mein Bhoot). ఈ చిత్రంలో బాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి లీడ్ రోల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ నటి జెనీలియా దేశ్ ముఖ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనోజ్ బాజ్‌పేయి, ఆర్జీవీ 1998లో వచ్చిన కల్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సత్యకు కలిసి పనిచేశారని తెలిసిందే. ఆ తర్వాత ఈ కాంబోలో యాక్షన్ డ్రామా సర్కార్ 3 కూడా వచ్చింది.
ఇప్పుడు హార్రర్ జోనర్లో మరో సినిమా వస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ మూవీ షూట్ గురించి మనోజ్ బాజ్‌పేయి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. గోవాలో మనోజ్బాజ్పేయి మీడియాతో మాట్లాడుతూ.. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్టేనన్నాడు. షూటింగ్ చాలా ఫన్‌గా జరిగిందన్నాడు మనోజ్ బాజ్‌పేయి. ఆర్జీవీ ఇందులో ఇతరులు చేయలేని పనులను నాతో చేయిస్తాడు. సినిమాలో నేను పాడటం, డ్యాన్స్ చేయడం, భయపడటం, ఇతరులను భయపెట్టడం మీరు చూస్తారంటూ చెప్పుకొచ్చాడు మనోజ్ బాజ్‌పేయి. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఇటీవలే ఈ మూవీ నుంచి రమ్యకృష్ణ లుక్ విడుదల చేయగా.. గదవ నుంచి నుదుటి వరకు చుక్కల బొట్టుతో కనిపిస్తున్న రమ్యకృష్ణ మెడలో విభిన్నమైన ఆభరణాలు వేసుకొని నయా అవతార్‌లో కనిపిస్తుంది. భయంకరమైన గ్యాంగ్‌స్టర్ ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్టు చేతిలో చనిపోతాడు. అయితే అతడు పోలీస్‌స్టేషన్‌ను వేటాడటానికి ఘోస్ట్ రూపంలో తిరిగొస్తాడు. అందుకే టైటిల్‌ను పోలీస్‌స్టేషన్‌లో భూతం (Police Station Mein Bhoot).. చనిపోయినవారిని నువ్వు అరెస్ట్ చేయలేవు.. అంటూ ఆర్జీవీ సినిమాపై ఇప్పటికే అంచనాలు అమాంతం పెంచేశాడని తెలిసిందే.
NC 24 | నాగచైతన్య బర్త్ డే స్పెషల్.. మహేశ్ బాబు వారణాసి లుక్‌తో ఎన్సీ 24 క్రేజీ న్యూస్
Abishan Jeevinth | హీరోగా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు.. ‘విత్ లవ్’ టీజర్ విడుదల!