సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 ( నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 32.7 డిగ్రీలు, కనిష్ఠం 19.6 డిగ్రీలు, గాలిలో తేమ 44 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.