హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 8: సౌదీ అరేబియా రియాద్‌లో తెలుగు భాష, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) ఆధ్వర్యంలో సక్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో అంగరంగా వైభవంగా నిర్వహించారు. సాటా ఫౌండర్ మల్లేష్, ముఖ్యఅతిథులు సక్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ మాసూద్ రియాద్, అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ, వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ నూరొద్దీన్(వరంగల్) మాట్లాడుతూ.. సౌదీ అరేబియాలో ఉన్న మన తెలుగువారందరూ కలిసి తెలుగుభాష దినోత్సవ, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
వివిధ ప్రాంతాల యాంబు అధ్యక్షుడు కాశీరాజు, జెడ్డా అధ్యక్షులు అంజాద్, ఈస్ట్ర రీజియన్ అధ్యక్షుడు తేజ, టాసా ఫౌండర్ స్వామి పాల్గొన్నారు. రియాద్‌లో పది సంవత్సరాలపైబడి విద్యారంగంలో సేవలందించిన ఉపాధ్యాయులకు గౌరవ సత్కారం, మెమొంటో అందజేశారు. కార్యక్రమంలో రియాద్ కోర్ టీం సభ్యులు శర్వాణి, విద్యాధరణి, కోకిల, ప్రీతి, లోకేష్, సింగ్ నరేష్, శహబాజ్ అహ్మద్, మహ్మద్ అబ్దుల్ ఘపార్, మిథున్ సురేష్, ముదిగొండ శంకర్, వీరవల్లి యోగేశ్వరారావు, మురళీక్రిష్ణ బూసి, నయీమ్, అయాజ్, ముజామిలుద్దీన్దీ, ఇలియాస్, అస్లాం పాల్గొన్నారు.