హనుమకొండ చౌరస్తా, జనవరి 24: దశాబ్దాలుగా పాటిస్తున్న ఒగ్గు సంప్రదాయం ప్రకారమే కొమురవెల్లిలో స్వామివారి కల్యాణం, బండారి (పసుపు) చల్లడం, మేలుకొలుపు, ఎదుర్కోళ్లు చేపట్టామని రాష్ట్ర అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ స్పష్టంచేశారు. కొమురవెల్లి సన్నిధిలో ఈసారి ఆగమ, వైదికశాస్త్ర పద్ధతుల్లో పూజలు నిర్వహించారంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. సోమవారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొమురవెల్లి అర్చకులపై అసత్య ప్రచారం చేస్తే ఊరు కోబోమని హెచ్చరించారు. 800 ఏండ్లుగా వీరశైవ పద్ధతిలో పూజలు చేస్తున్నార ని,1950లో ఎండోమెంట్‌కు అప్పగించిన తర్వాత కూడా అవే ఆచారాల ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారని స్పష్టంచేశారు. ఆలయానికి సంబంధం లేని కొంతమంది తప్పుడు ప్రచారాలతో ఆలయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. అనంతరం కొమురవెల్లి ప్రధానార్చకుడు ఎం మల్లికార్జున్ మాట్లాడుతూ.. ఆలయంలో అనువం శిక అర్చకులుగా కొనసాగుతున్నామని, 800 ఏండ్ల నుంచి సంప్రదాయం ప్రకా రమే పూజలు చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో అర్చక సమాఖ్యరాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనుగుల రత్నాకర్, కొమురవెల్లి దేవస్థాన స్థానాచార్యులు పీ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.