హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గవర్నర్ శివప్రతాప్ శుక్లాను బుధవారం సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు ఎడ్మ బొజ్జు, మేడిపల్లి సత్యం లోక్‌భవన్‌లో కలిశారు. బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ రా జ్యాంగం కల్పించిందని, డప్పుకొట్టడం దళితుల వృత్తిలో భాగమని వారు పేర్కొన్నారు.