Metro rails : సంక్రాంతి పండగ నేపథ్యంలో నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు వెళ్తున్నారు. దాంతో నగరంలోని బస్టాండులు, రైల్వే స్టేషన్లు, కిక్కిరిసిపోయాయి. నగరంలోని ప్రధాన బస్టాప్‌లు అయిన ఎల్బీనగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర ప్రాంతాలకు జనం పోటెత్తారు. అందుకోసం ప్రధానంగా మెట్రో రైళ్లను వినియోగిస్తున్నారు. దాంతో మెట్రో రైళ్లలో భారీగా రద్దీ నెలకొన్నది.
దాదాపు అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. మరోవైపు బస్టాండులు, రైల్వే స్టేషన్లలో కూడా భారీగా రద్దీ నెలకొన్నది. ప్రధాన రహదారుల్లో టోల్ ప్లాజాలు కూడా కిక్కిరిసిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా దగ్గర గంటకు 900 వాహనాలు నగరం దాటి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.