హైదరాబాద్, జనవరి 29 : తెలంగాణలో ప్రతి దేవాలయం ముందు స్వాగత తోరణం రా రమ్మంటూ భక్తులకు స్వాగతం పలుకుతుంటుంది. ప్రతి బడి కూడా గుడిలాంటిదే.. కాబట్టి ప్రతి పాఠశాల ముందు స్వాగత తోరణం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పవిత్రమైన బడిలోకి మట్టి, బురద కాళ్లతో వెళ్లకుండా పరిశుభ్రత పాటించేలా.. పాత్వేలను సైతం నిర్మించనున్నది. పాఠశాల గేటు నుంచి తరగతి గదులు, మూత్రశాలలకు చేరుకునేలా నడకదారులు (పాత్వే) నిర్మించనున్నారు. మన ఊరు – మన బడి పథకం తొలివిడతలో 9,123 పాఠశాలల్లో.. ఒక్కో స్కూళ్లో 100 -150 మీటర్ల పొడవైన పాత్వేను నిర్మించనున్నారు. సర్కారు స్కూళ్లలో విశాలమైన మైదానాలు, ఆటస్థలాలు ఉంటాయి. రాళ్లు రప్పలు, మట్టిదారుల్లో విద్యార్థులు నడస్తూ బడికి చేరుకోవడంతో ప్రాంగణాల్లోకి మట్టి దుమ్ముధూళి కణాలు చేరుతున్నాయి. వర్షం పడ్డప్పుడు బురద, మట్టి తరగతి గదులకు చేరుతూ ఉంటుంది. ప్రాంగణాల్లోని బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లు విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటి నుంచి విద్యార్థులను రక్షించడంలో భాగంగా పాత్వేలను నిర్మించనున్నారు.
పాత్వే ప్రత్యేకతలు..