హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ గడువును మరోసారి పొడిగించారు. ఈ మేరకు సవరించిన కొత్త షెడ్యూల్ను ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది.
ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం ఎన్యుమరేషన్ ఫామ్ల సమర్పణకు ఆగస్టు 3 చివరి తేదీ కాగా, బీఎల్వోలు, పౌరులు, వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఈ గడువును ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించారు.