ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తవా? రాజీనామా చేస్తవా?
పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం ధర్నాలు , ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించిన విద్యార్థి నేతలు
- విద్యార్థుల భారీ ర్యాలీ, కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడి
రఘునాథపాలెం/ ఖమ్మం కమాన్‌బజార్/ మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూలై 31 : పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం ధర్నాలు , ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం నగరంలో నిర్వహించిన ర్యాలీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నేత రాకేశ్దత్త మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తవా? విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేస్తవా? అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
విద్యార్థులు ఆర్డీవో ఆఫీస్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందజేశారు. పీడీఎస్‌యూ ఖమ్మంజిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

