హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకపోవడంపై తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) అసంతృప్తి వ్యక్తం చేసింది.
జనజాగరణ యాత్రలో భాగంగా సీపీఎస్ఈయూ ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లికార్జున్, హైదరాబాద్ జిల్లా కోశాధికారి శ్యామ్‌సుందర్ తదితరులు ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సమావేశమై సీపీఎస్ రద్దు అంశాన్ని ప్రస్తావించారు.
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగాన్ని కా ర్పొరేటు సంస్థలకు కట్టబెట్టేందుకు చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కన్వీనర్ పశ్య పద్మ డిమాండ్ చేశారు. సోమవారం ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ నుంచి లోక్‌భవన్ వర కు ర్యాలీగా వెళ్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులను పొలీసులు అరెస్టు చేసి అఫ్జల్‌గంజ్, పంజాగుట్ట పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పశ్య పద్మ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బ తీసే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.