Teja Sajja | ఇటీవలే మిరాయి (Mirai) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు హనుమాన్ ఫేం తేజ సజ్జా (Teja Sajja). ఈ మూవీ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తూ తెలుగుతోపాటు విడుదలైన అన్ని భాషల్లో సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకొని నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. సుమారు 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మిరాయి పాన్ ఇండియా మార్కెట్లో బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఈ మూవీ టీం సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.
టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మిరాయి టీంతో కలిసి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. దిల్ రాజు నివాసంలో తేజ సజ్జా, డైరెక్టర్ అండ్ టీం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. టీం మెంబర్స్ అంతా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మిరాయిలో ఢిల్లీ భామ రితికా నాయక్ (Ritika Nayak) ఫీమేల్ లీడ్ రోల్లో నటించగా.. మంచు మనోజ్ (Manchu Manoj) కీ రోల్ పోషించాడు.
ఈ మూవీకి సీక్వెల్ రానుండగా.. మిరాయి : జైత్రయా టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. సీక్వెల్ పార్టులో టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వస్తుండగా.. రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుందో చూడాలి.
A night to remember, a success to cherish ❤️
Producer #DilRaju garu and family celebrated the grand success of #MIRAI by hosting a warm and heartfelt gathering for Superhero @TejaSajja123 at their home ❤️🔥
A beautiful evening where admiration met accomplishment 🫶… pic.twitter.com/C6IIMARJfU
— BA Raju’s Team (@baraju_SuperHit) October 5, 2025
Kalki 2 | సాయిపల్లవితో నాగ్ అశ్విన్ చర్చలు.. ఇంతకీ ప్రభాస్ కల్కి 2 కోసమేనా..?
Aaryan Movie | నితిన్ చేతికి విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సినిమా రైట్స్
The Raaja Saab | ప్రభాస్ ‘ది రాజాసాబ్’ డబ్బింగ్ షురూ.!