రాయపోల్ జనవరి 23 : ప్రతి పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సిద్ధిపేట జిల్లా రాయపోల్ తహసీల్దార్ కృష్ణమోహన్ అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించి, ఓటర్ చైతన్యంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని ఎన్నికల్లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.