రూ.1.50 కోట్ల వరకూ ఆఫర్
న్యూఢిల్లీ, మార్చి 26: దిగ్గజ టెక్నాలజీ సంస్థ యాపిల్ తన సిబ్బందిలో కొంతమందికి భారీ బోనస్‌లు ప్రకటించింది. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్నాలజీ కంపెనీల నుంచి నిపుణుల కోసం పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ట్యాలెంట్‌ను నిలుపుకునేందుకు యాపిల్ తన ఉద్యోగులకు భారీ ఆఫర్ ఇస్తున్నట్టు బ్లూంబర్గ్ వార్తా సంస్థ ఒక కథనం వెలువరించింది. ఈ కథనం ప్రకారం సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ విభాగాల్లో అత్యంత నైపుణ్యం ప్రదర్శిస్తున్న ఇంజనీర్లకు 1,00,000 డాలర్ల నుంచి 2,00,000 డాలర్ల (దాదాపు రూ.1.50 కోట్లు) విలువైన బోనస్‌లు ఇవ్వనున్నది. గత డిసెంబర్ నెలలో సైతం యాపిల్ 50,000 డాలర్ల నుంచి 1,80,000 డాలర్ల మేర బోనస్‌లు ఇచ్చింది. ఈ రెండో రౌండులో గత బోనస్లకంటే తక్కువ మందికి అందవచ్చు. స్పెషల్ రిటెంన్షన్ గ్రాంట్స్‌గా బోనస్‌లను స్టాక్ యూనిట్ల రూపంలో యాపిల్ ఇవ్వనుంది. నిపుణులు పోటీ సంస్థకు వెళ్లకుండా అట్టిపెట్టుకునేందుకు యాపిల్ ఈ ప్రోత్సాహాకాల్ని అందిస్తున్నది. వీటితో పాటు ఉద్యోగులందరికీ వార్షిక బోనస్‌లు కూడా ఇస్తున్నది.