అహ్మదాబాద్: ఇంగ్లండ్‌ను చిత్తుచేసి టీ20 సిరీస్ చేజిక్కించుకున్న వెస్టిండీస్ విజయోత్సాహంతో భారత్‌లో అడుగుపెట్టింది. మూడు వన్డేలు ,మూడు టీ20ల సిరీస్‌లు ఆడేందుకు విండీస్ జట్టు బుధవారం అహ్మదాబాద్‌కు చేరుకుంది. ఈనెల 6, 9, 11 తేదీల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో వన్డే సిరీస్ జరుగనుంది. ‘అహ్మదాబాద్‌కు సురక్షితంగా చేరుకున్నాం. భారత్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు మేం సిద్ధం’ అని క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ట్వీట్ చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈనెల 16, 18, 20 తేదీల్లో టీ20 సిరీస్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లకు 75 శాతం ప్రేక్షకులకు అనుమతించగా.. వన్డే సిరీస్‌కు గుజరాత్ క్రికెట్ సంఘం నిరాకరించింది.