రంగారెడ్డి, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : జిల్లా అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడం తో.. సేవ్ టీచర్స్ సంఘం ఆందోళనకు సిద్ధమైంది. అందులో భాగంగానే శనివారం సేవ్ టీచర్స్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని కలిసి జిల్లా అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని కోరుతూ వినతిపత్రం అందజేశా రు.
రంగారెడ్డి జిల్లాను అర్బన్, రూరల్ జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని..గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ జిల్లా ల పునర్విభజన తదితర అంశాలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ఉపాధ్యాయులు, ఉద్యోగులు సీనియారిటీ, ప్రమోషన్లు కోల్పోవడంతో సుదూర, ప్రాంతాలకు బదిలీపై వెళ్లాల్సిన పరిస్థితులు, స్థానిక నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదముందన్నారు. ఇప్పటికే జీవో 317ను అడ్డం పెట్టుకుని వందలాది మంది నాన్‌లోకల్ ఉపాధ్యాయులు జిల్లాలోకి ప్రవేశించారని, మరోసారి జిల్లాల విభజన జరిగితే స్థానిక ఉపాధ్యాయులు మరిం త నష్టపోతారని వారు ఆవేదన వ్యక్తం చేశా రు. జిల్లాను రూరల్, అర్బన్ జిల్లాలుగా విభజిస్తే గ్రామీణ జిల్లాలో పోస్టులు తగ్గుతాయని..కొత్త పోస్టులు పట్టణ జిల్లాకు వెళ్తాయ ని తద్వారా స్థానిక నిరుద్యోగులకు అన్యా యం జరుగుతుందన్నారు.
పోలీస్ కమిషనరేట్ హద్దుల మార్పు కూడా సమంజసం కాదన్నారు. ఇప్పటికే మెడికల్, డిప్యుటేషన్, గవర్నమెంట్ ఆర్డర్ల పేరుతో ఇతర జిల్లాల నుంచి నాన్‌లోకల్ వారు సుమారు వెయ్యి మంది జిల్లాలో ఉద్యోగాలు సంపాదించ డం తో స్థానికులకు అన్యాయం జరిగిందన్నారు. సేవ్ టీచర్స్ ఆధ్వర్యంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని కలిసిన వారి లో సేవ్ టీచర్స్ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రవి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మధుకర్‌రెడ్డి, సురేశ్, జిల్లా నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, హరికృష్ణ, బాషయ్య, శ్యాంసుం దర్, విజయ్‌కుమార్, భాస్కర్ ఉన్నారు.