“నారీ నారీ నడుమ మురారి’ చాలా క్లీన్ కామెడీ ఎంటర్టైనర్. పండుగకి నిజంగా పర్ఫెక్ట్ సినిమా. దర్శకుడు రామ్ అబ్బరాజు అద్భుతమైన యూనిక్ పాయింట్‌తో ఈ కథ రాసుకున్నారు. ఈ సినిమాలో నాది చాలా ప్రాధాన్యత గల పాత్ర. ఇందులో అంతా సిట్యువేషన్ కామెడీనే. స్వతహాగా నాకు కామెడీ చేయడం ఇష్టం. అది ఏ స్థాయిలో ఉంటుందో రేపు మీరు తెరపై చూస్తారు.’ అని కథానాయిక సంయుక్త మీనన్ అన్నారు. శర్వానంద్ కథానాయకుడిగా రూపొందిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలోని ఇద్దరు కథానాయికల్లో ఒకరుగా నటించారు సంయుక్త మీనన్.
రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో ముచ్చటించారు సంయుక్త మీనన్. ఈ సినిమాకు సైన్ చేసినప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఉందో, పూర్తయిన తర్వాత కూడా అదే ఎక్సైట్మెంట్తో ఉన్నాననీ, ఈ సినిమాకు డబ్బింగ్ కూడా తానే చెప్పాననీ, సినిమా అద్భుతంగా వచ్చిందనీ సంయుక్త మీనన్ నమ్మకంగా చెప్పారు.
‘శర్వా మంచి టైమింగ్ ఉన్న హీరో. చాలా సపోర్టివ్ కూడా. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం. ఇందులో నరేష్, సత్య పాత్రలు చాలా బావుంటాయి. మా దర్శకుడు రామ్ చాలా కూల్. ఇంత కాంపిటేషన్‌లో కూడా ఆయనలో ఒత్తిడి లేదు. సాక్షి వైద్యతో నా కాంబినేషన్ సీన్లు అందర్నీ ఆకట్టుకుంటాయి.’ అని చెప్పారు సంయుక్త.