హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) ప్రభుత్వాన్ని కోరింది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన టీటీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు మణిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏరుకొండ నర్సింహస్వామి మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యావలంటీర్లను నియమించాలని కోరారు.