హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): టెట్ నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం తపస్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ను తపస్ ప్రతినిధులు కలిశారు.
టీచర్లకు టెట్ అవసరంలేదని, 2010లో ఎన్సీటీఈ జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేంద్రమంత్రి స్పందిస్తూ న్యాయనిపుణులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.