కట్టంగూర్, మార్చి 07 ; విద్యా రంగంలో మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలుసుస్తున్నారని కట్టంగూర్ మండల విద్యాధికారి అంబటి అంజయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, వారు దేశానికి, సమాజానికి అందిస్తున్న సేవలు అపారమని కొనియాడారు. మహిళల సేవలను గుర్తించి వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుకు సాగేందుకు ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అనంతరం మహిళ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. మహిళ దినోత్సవ ప్రాముఖ్యతపై ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాణి, తేజస్విని, జయమ్మ, కనకదుర్గ, శ్రీదేవి, షాహిదా, నీరజ, యాదమ్మ, శైలజ పాల్గొన్నారు.