Chandrababu | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తాము ఎన్డీఏ కూటమి తోనే ఉన్నామని టీడీపీ అధినేత చంద్ర బాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో మీడి యాతో మాట్లాడారు. కూటమి ఘన విజయంపై రాష్ట్ర ప్రజలకు ధన్యవా దాలు తెలిపారు. తమ విజయం మూ డు పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి ఫలితమని చెప్పారు. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.