Pulivendula | పులివెందుల పుర పోరులు టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్లదాడి
Pulivendula | ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఎన్నికల్లో (Municipal elections ) ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం ప్రారంభమైన పుర పోరు పోలింగ్‌లో కడప జిల్లా పులివెందులలో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టిస్తున్నారు.
Pulivendula | ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఎన్నికల్లో (Municipal elections ) ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం ప్రారంభమైన పుర పోరు పోలింగ్‌లో కడప జిల్లా పులివెందులలో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా పచ్చమూకలు ఓటర్లను అడ్డుకుంటున్నాయి. అధికార బలం అండ చూసుకొని పచ్చ పార్టీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. చివరకు టీడీపీ అరాచకాలను కవర్ చేస్తున్న జాతీయ మీడియాపై కూడా ఆ పార్టీ రౌడీలు దాడి చేశారు. జాతీయ మీడియా కెమెరాను ధ్వంసం చేశారు. అలాగే పులివెందుల 11, 12 బూత్‌ల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు రాళ్లు విసురుతున్నారు. బూత్‌లకు ఎవరూ రాకుండా పచ్చమూకలు అడ్డుకుంటున్నారు.
ఇంతటితో ఆగకుండా పోలింగ్ బూత్‌లను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, టీడీపీ గూండాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో పులివెందుల బాయ్స్ జూనియర్ కాలేజీ వద్ద ఓటర్లు నిరసనకు దిగారు. పోలింగ్ బూత్ వద్ద 400 మంది ఓటర్లు బైఠాయించారు.
తమ ఓట్లు టీడీపీ నేతలే వేస్తున్నారని స్థానిక ఓటర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఓటర్లపై డీఎస్పీ మురళీ నాయక్ బెదిరింపులకు దిగారు. వెళ్లిపోండి.. ఓట్లు వేయొద్దు అంటూ బెదిరించిన డీఎస్పీ.. మీకు ఓటు వేసే హక్కు లేదంటూ ఓటర్లకు డీఎస్పీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఓటర్లకు రక్షణ కల్పించకుండా పోలీసులు వెనక్కి పంపతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు విజయవాడలో(Vijayawada) గరపాలక సంస్థ 55వ డివిజన్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు పక్కన హస్తం గుర్తు ముద్రించగా.. కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదుట ఫ్యాన్ గుర్తు ముద్రించారు. బ్యాలెట్ పేపరలో గుర్తులు మారడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారి చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు డివిజన్లో పోలింగ్ నిలిపి వేశారు. కొత్తగా బ్యాలెట్ పేపర్స్ ప్రింట్ చేసిన తర్వాత పోలింగ్ జరగనున్నట్లు సమాచారం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pulivendula | పులివెందుల పుర పోరులు టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్లదాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

