చెన్నై : వైద్య విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చడం వలన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఇందుకు న్యాయపరమైన అడ్డుంకులుంటే, వాటిని తొలగించే వరకూ తాత్కాలికంగా ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అన్నారు.
‘నీట్’ రద్దు చేయాలనే నిర్ణయానికి తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు, వారి కుటుంబాలపై నీట్ తీవ్ర ప్రభావం చూపుతున్నదని, కేవలం ఎన్నికల హామీల కోసం తమ పార్టీ తప్పుడు హామీలు ఇవ్వబోదన్నారు.