తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం బుధవారం ఖైరతాబాద్‌లోని మింట్‌కాంపౌండ్ టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద మహాధర్నాకు దిగారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ల జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు చేపట్టిన ఈ నిరసనలో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది ఆర్టిజన్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ నినదించారు. తమ సమస్యలు తెలియజేయడానికే ఈ ధర్నా నిర్వహించామని, వారం రోజులలోగా ఎలాంటి నిర్ణయం రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాక్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, కో చైర్మన్ సుదాగని శ్రీధర్‌గౌడ్, కన్వీనర్లు సాయిలు, చంద్రారెడ్డి స్పష్టం చేశారు.
-సిటీబ్యూరో