చాంగ్జౌ : జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన జోష్‌లో ఉన్న స్టార్ షట్లర్ పీవీ సింధు.. చైనా ఓపెన్‌నూ విజయంతో ఆరంభించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. 21-14, 9-21, 21-10తో భారత్‌కే చెందిన యువ షట్లర్ ఉన్నతి హుడాను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది.
పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్.. 22-20, 15-21, 21-14తో యుశి టనాక (జపాన్)ను చిత్తుచేశాడు. మరో పోరులో భారత యువ సంచలనం ఆయుష్ శెట్టి.. 21-17, 5-21, 21-17తో ప్రపంచ 11వ ర్యాంకర్ అల్వి ఫర్హాన్ (ఇండోనేషియా)కు షాకిచ్చాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల-తనీషా క్రాస్టో జంటతో పాటు మెన్స్ డబుల్స్‌లో అర్జున్-హరిహరన్ జోడీ తొలి రౌండ్‌కే ఇంటిబాట పట్టింది.